Osmania-Civils Acadamy | ఓయూలో సివిల్స్ కు ఉచిత శిక్షణ
యూపీఎస్‌సీ ప్రిలిమ్స్ కొరకు ఉచిత శిక్షణకై అప్లికేషన్స్ ఆహ్వానం
దరఖాస్తులకు నవంబర్ 8 వరకు గడువు
ఓయూ సివిల్ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ కొండా నాగేశ్వర్ వెల్లడి
Hyderabad : జాతీయ స్థాయిలో నిర్వహించే సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ 2024- 25 విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఉచిత శిక్షణ ఇవ్వడానికి ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు ఓయూ క్యాంపస్‌లో ఉన్న సివిల్ సర్వీస్ అకాడమి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అకాడమి డైరెక్టర్ డాక్టర్ కొండా నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. అందుకోసం నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఓయూ క్యాంపస్ కళాశాలలో పీజీ, పీహెచ్ డి చదువుతున్న విద్యార్థులకు సివిల్స్ లో ఉచిత శిక్షణను ఇవ్వడానికి ఈ సివిల్ సర్వీస్ అకాడమీ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం కుమార్ ఆదేశాల మేరకు మేరకు సర్క్యులర్ విడుదల చేశామని పేర్కొన్నారు. అప్లికేషన్ కు సంబంధించిన వివరాలు ఓయూ అధికారిక వెబ్ సైట్‌లో పొందుపరిచినట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఉచితంగా అప్లికేషన్ను డౌన్ లోడ్ చేసుకొని, పని రోజులలో సివిల్ సర్వీస్ అకాడమీ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఉచిత శిక్షణకు దరఖాస్తులు దాఖలు చేయడానికి నవంబర్ 8 వరకు గడువు విధించినట్లు తెలిపారు. అయితే అన్ని పనిదినాలలో అకాడమి కార్యాలయాన్ని సంప్రదించాలని తెలిపారు. అత్యంత నాణ్యత విధానంలో బోధించే ఈ శిక్షణ తరగతులను ఓయూ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
( Applications Available on OU Website for Free coaching for Civils Service( Prelims). All the interested bonafied students of OU campus and constituent colleges are informed to send their application for free coaching for civls(Prelims). Last date : 8th November 2024.
For more details.... Check OU website. - DrKonda Nageswar, Director-Civils Service Academy, Osmania University)
* * *
Leave A Comment